- Advertisement -
జూలై 5 నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. దరఖాస్తు చేసుకుని పెండింగ్లో ఉన్న 4.50 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు కేటీఆర్.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే మానేరు నిండిందని…. చెరువుల నిండా నీళ్లు ఉండటంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. స్వరాష్ట్రం వచ్చాకే చెరువులు బాగు పడ్డాయని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు స్ఫూర్తితో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చారని కేటీఆర్ అన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ విలువ అందరికీ తెలిసిందన్న కేటీఆర్.. ఊరంతా మొక్కలు నాటి పెంచాలని పిలుపునిచ్చారు.
- Advertisement -