- Advertisement -
కరోనా మృతులకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు పరిహారం అంశాలపై ఇవాళ సుప్రీం కోర్టులో వానదలు జరుగగా …కీలక ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.
కోవిడ్ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఎంత ఇవ్వాలన్న దానిపై మార్గదర్శకాలు తయారు చేయాలని ఎన్డీఎంఏ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ)ను సుప్రీం ఆదేశించింది. ఆరు వారాల వ్యవధిలోగా ఆ మార్గదర్శకాలను రూపొందించాలని అయితే ఎంత నష్టపరిహారం ఇవ్వాలన్న దానిపై ఎన్డీఎంఏనే డిసైడ్ చేసుకునేలా కోర్టు తీర్పునిచ్చింది.
డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌లోని 12వ సెక్షన్ ప్రకారం నష్టపరిహారాన్ని ఫిక్స్ చేయనున్నారు. కోవిడ్‌తో చనిపోయివారికి ఇచ్చే డెత్ సర్టిఫికేట్‌లో తేదీ, ఏ కారణం చేత మరణించాడో ఉండాలని కోర్టు తెలిపింది.
- Advertisement -