‘మా’ ఎన్నికలపై విజయశాంతి..

237
vijayashanthi
- Advertisement -

సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు. ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ పోటీకి సిద్దమవగా ప్రకాశ్ రాజ్ ఏకంగా తన ప్యానెల్‌ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఈ నేపథ్యంలో మా ఎన్నికలపై స్పందించారు సినీ నటి విజయశాంతి. తనకు మా సభ్యత్వం లేకపోయిన నటులు సీవీయల్ నరసింహ రావు చేసిన వ్యాఖ్యలు సరైనవేనంటూ వెల్లడించారు. మా ఎన్నికలపై సీవీయల్ నరసింహా రావు ఆవేదన న్యాయమైనది, ధర్మమైంది.. నేను మా సభ్యురాలిని కాకపోయినా ఒక కళాకారిణిగా స్పందిస్తున్నా… చిన్న కళాకారుల సంక్షేమం దృష్ట్యా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నా అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు విజయశాంతి..

- Advertisement -