- Advertisement -
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం వరంగల్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వరంగల్ సెంట్రల్ జైలు మైదానానికి వెళ్లి నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని తొలగించి మొత్తం 60 ఎకరాల్లో 24 అంతస్తులతో సకల హాంగులతో ఈ దవాఖానను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
2 వేల పడకల సామర్థ్యం, 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఈ దవాఖాన ప్రత్యేకత. 24 అంతస్తుల భవనంపై హెలిప్యాడ్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇక ఈపర్యటనలో భాగంగా సీఎం 6.73 ఎకరాల్లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సైతం ప్రారంభించారు.
- Advertisement -