23న మహేశ్‌ మేనల్లుడి మూవీ టైటిల్‌ టీజర్‌..

252
mahesh
- Advertisement -

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అమర రాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అశోక్‌ గల్లా సరసన హీరోయిన్‌గా నిధీ అగర్వాల్‌ నటిస్తోంది. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రధారులు.

ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ఓ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. అశోక్‌ గల్లా గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తుంటుంది. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్‌ ప్రసాద్‌ ఛాయగ్రాహకులుగా పనిచేస్తున్నారు. చంద్రశేఖర్‌ రావిపాటి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: అశోక్‌ గల్లా, నిధీ అగర్వాల్, జగపతిబాబు, నరేష్, కౌశల్యా, వెన్నెల కిశోర్, సత్య, మైమ్‌ గోపి, అర్చన సౌందర్య, అజయ్‌ ప్రభాకర్‌
సాంకేతిక విభాగం
స్టోరీ, స్క్రిన్‌ ప్లే, దర్శకత్వం: టి. శ్రీరామ్‌ ఆదిత్య
ప్రొడ్యూసర్‌: పద్మావతి గల్లా
బ్యానర్‌: అమర రాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి
మ్యూజిక్‌: జిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌
ఆర్ట్‌: ఏ. రామాంజనేయులు
ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి
డైలాగ్స్‌: కల్యాణ్‌ శంకర్, ఠాకూర్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అక్షయ్‌ త్యాగీ, రాజేష్‌
పీఆర్వో: వంశీ–శేఖర్‌

- Advertisement -