సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న డబ్లూటీసీ ఫైనల్ మ్యాచ్లో మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. శనివారం పడిన టాస్ తో… కెప్టెన్ గా ధోనీకి మించిన రికార్డులు నమోదయ్యాయి. కెప్టెన్ గా ధోనీ 61 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. మ్యాచ్ కు ముందు ఇద్దరూ 60టెస్టు మ్యాచ్ ల కెప్టెన్లుగా సమానంగా ఉన్నారు. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో కోహ్లీ ఆరికార్డు బ్రేక్ చేశాడు.
రెండు సార్లు వరల్డ్ కప్ విన్నర్ అయిన ధోని 60 మ్యాచ్ లకు కెప్టెన్సీ వహించాడు. ఇక కోహ్లీ పేరిట మరో రికార్డు నమోదయ్యింది. మేజర్ ఐసీసీ టోర్నీల్లో ఎక్కువ ఫైనల్ మ్యాచ్ లలో ఆడిన క్రికెటర్ గా చరిత్రకెక్కాడు. టెస్టు ఫార్మాట్ లో ఎక్కువ కాలం కెప్టెన్ గా వ్యవహరించిన వారిలో.. ఆసియన్ కెప్టెన్ గా కోహ్లీనే ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీలంక ప్లేయర్ అర్జున రణతుంగా, పాకిస్తాన్ ప్లేయర్ మిస్బా ఉల్ హఖ్ లు చెరో 56మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించారు.