- Advertisement -
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ దంపతులు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఎన్‌వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు.
లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న రమణ..అనంతరం ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో చేపట్టిన నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్ పనులు, ఆలయ నగరిని జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
- Advertisement -