సినీ కార్మికులకు అండగా బిగ్ బాస్ సోహెల్..!

172
sohail
- Advertisement -

కరోనా కష్టకాలంలో సినీ కార్మికులకు అండగా నిలిచారు బిగ్ బాస్ ఫేం సోహెల్. త‌న వంతు సాయంగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ని పంపిణీ చేశారు. అంతేకాదు మరిన్ని సేవా కార్య‌క్ర‌మాలు చేస్తాన‌ని అన్నారు. ఇది నేనొక్క‌డినే చేసింది కాదు , కొంత మంది ఫ్యాన్స్‌తో క‌లిసి సొహిలియన్స్‌గా ఫామై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ షో ద్వారా విశేష ఆదరణ పొందాడు సోహెల్. సోహెల్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కూడా సోహెల్‌కు ఫిదా అయ్యారు. ఓ సంద‌ర్భంలో త‌న ఇంటికి కూడా పిలిపించుకున్నారు.

- Advertisement -