- Advertisement -
రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించాయని…. దీనికి తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో మరింత బలపడుతుందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలో భారీ వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించింది.
- Advertisement -