రేపటీ నుంచే రైతుబంధు

128
rythu
- Advertisement -

రేపటి నుండి 25వ తేదీ వరకు రైతు బంధు పంపిణీ జరగనుంది. ముందుగా ఎకరం నుంచి మొదలుకొని చివరి ఎకరం భూమిదాకా పంటసాయం పంపిణీ చేయనున్నారు. నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు జమకానుండగా ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

మొత్తం ఈ సీజన్‌కు 63,25,695 మంది రైతులను అర్హులుగా గుర్తించగా 150.18 లక్షల ఎకరాలకు రైతుబంధు అందనుంది. ఇందుకోసం రూ.7,508.78 కోట్లు అవసరంకాగా, నిధులను ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులకు అందజేసింది.

కొత్తగా 2.81 లక్షల మంది రైతులకు రైతు బంధు అందనుండగా 66వేల ఎకరాలు కొత్తగా చేరాయి. రైతుబంధు సాయం పొందడంలో నల్లగొండ జిల్లా టాప్‌లో ఉండగా అత్యల్పంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో రైతుబంధు లబ్దిదారులు ఉన్నారు. 39,762 మందికి 77 వేల ఎకరాలకు రైతుబంధు అందనున్నది. వరుసగా ఏడోసారి రైతుబంధు కింద అన్నదాతకు పంటసాయం అందిస్తోండగా కరోనా విపత్తులో ఇది మూడోసారి.

- Advertisement -