ముగిసిన ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

212
jagan cm
- Advertisement -

ఏపీ సీఎం రెండు రోజుల డిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను కలిసిన జగన్‌.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను చర్చించారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్‌ గోయల్‌, షెకావత్‌‌, జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌లను కలిశారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి సీఎం జగన్ చర్చలు జరిపారు. నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఉదయం కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ను సీఎం జగన్ కలిశారు. రాష్ట్ర సివిల్ సప్లయ్ కు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పీయూష్‌ని కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు జగన్‌.

- Advertisement -