- Advertisement -
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈనెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్రంలో ప్రవేశించగా అల్ప పీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరఠ్వాడా నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్రమట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ వరకు ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. గంటకి 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
- Advertisement -