అభిమాని ప్రశ్నకు అసక్తిర సమాధానమిచ్చిన కోహ్లి..

241
Virat Kohli
- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి శనివారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే ముందు ముంబైలోని హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న విరాట్‌.. ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చాడు. అయితే ఈ ఫ్యాన్స్ మ‌ధ్య‌లో అత‌ని భార్య‌, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ వ‌చ్చింది. ముందు నా హెడ్‌ఫోన్స్ ఎక్క‌డ పెట్టావో చెప్పు అని అడిగింది. దీనికి కోహ్లి స్పందిస్తూ.. ఎప్పుడూ పెట్టిన‌ట్లే మ‌న బెడ్ ప‌క్క‌నే పెట్టాన‌ని చెప్ప‌డం విశేషం. దీంతోపాటు అభిమానులు అడిగిన ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు కోహ్లి ఓపిగ్గా స‌మాధాన‌మిచ్చాడు. తాను చివ‌రిసారి ఫుట్‌బాల‌ర్ క్రిస్టియానో రొనాల్డో ట్రాన్స్‌ఫ‌ర్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసిన‌ట్లు చెప్పాడు.

ఇక త‌న కూతురు వామిక పేరుకు అర్థ‌మేంటి, ఆమె ఫొటోను ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేద‌న్న ప్ర‌శ్న‌కూ అత‌డు స్పందించాడు. దుర్గాదేవికి మ‌రో పేరే వామిక అని, త‌న కూతురికి సోష‌ల్ మీడియా అంటే ఏంటో తెలిసే వ‌ర‌కూ ఆమె ఫొటోను బ‌య‌టకు చూపించ‌బోమ‌ని కోహ్లి చెప్పాడు. కాగా, కరోనా సెకండ్ విజృంభిస్తున్న వేళ విరుష్క జోడి.. దేశ ప్రజల కోసం తమకు తోచిన సాయం చేస్తున్నారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి రెండు కోట్ల విరాళం ప్రకటించిన విరుష్క జోడి.. ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపట్టింది.

- Advertisement -