మానవత్వం చాటుకున్న మంత్రి కొప్పుల..

105
Minister Koppula Eshwar
- Advertisement -

సామాజిక మాధ్యమం ఫేస్‌బక్ పోస్టుకు స్పందించి,ఆపదలో ఉన్న తల్లికి పెద్ద కొడుకులా మానవతా హృదయంతో ఆపన్నహస్తం అందించారు సంక్షేమశాఖ మంత్రి కొప్పులఈశ్వర్. దొంగతుర్తి గ్రామంలోని ఈ హృదయ విధారకర దృశ్యం ప్రతీ హృదయాన్ని కదిలించింది. నవ మాసాలు మోసి కనీ పెంచి లాలన పాలనా చూసుకున్న కన్న తల్లినే పట్టించుకున్న పాపాన పోలేదు. నలుగురు కూతుళ్లు ఒక పెద్ద కుటుంబం బంధు బలగం ఉండి కూడా సుమారు పది రోజుల నుండి కరోనా సోకి బిక్కుబిక్కుమంటూ అత్యంత దయనీయ పరిస్థితుల్లో చావుతో క్షణం క్షణం సహవాసం చేస్తున్న స్పందించిన దాఖలాలు లేవు. ఈ తరుణంలో మంత్రి కొప్పుల తన మానవత్వాన్ని చాటుకున్నారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన గుండ గంగమ్మ సుమారు పది రోజుల నుండి కరోనాతో బాధపడుతుంటే నలుగురు కూతుళ్లు గాని కుటుంబసభ్యులు గాని ఇరుగు పొరుగు వారు గాని పట్టించుకోలేదు. సామాజిక మాధ్యమం ద్వారా పరిస్థితిని తెలుసుకుని వెనువెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేసి కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు పంపించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కొప్పులఈశ్వర్ ఆదేశించారు.

- Advertisement -