ఉప్పర్‌పల్లిలో ర్యాంపులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

27
Minister KTR

హైదరాబాద్ నగరంలో ఉప్పర్ పల్లి వద్ద పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానంగా నిర్మించిన అదనపు ర్యాంపులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. రూ. 22 కోట్ల‌తో అత్తాపూర్ పిల్ల‌ర్ నెంబ‌ర్ 164 ద‌గ్గ‌ర ర్యాంపుల నిర్మాణం జ‌రిగింది. ఈ ర్యాంపుల అందుబాటుతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే ప్ర‌యాణికులు ఉప్ప‌ర్‌ప‌ల్లి వ‌ద్ద దిగి టోలీచౌకి, ఐటీ కారిడార్‌, ఇత‌ర ప్రాంతాల‌కు చేరుకోవ‌చ్చు.

అదేవిధంగా ఉప్పర్‌పల్లి వద్ద రెండవ ర్యాంప్‌ను ఉపయోగించి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఆర్‌జీఐఏకు చేరుకోవచ్చు. ఈ ర్యాంపుల అందుబాటుతో రాజేంద్రన‌గ‌ర్‌, ఉప్ప‌ర్‌ప‌ల్లి, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ త‌గ్గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ అండ్‌ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అరవింద్ కుమార్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి,పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య పాల్గొన్నారు.