- Advertisement -
కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి ప్రపంచ దేశాలు. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కాగా మిగితా దేశాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్ కీలకమని… జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ కొవిడ్-19 ప్రపంచాన్ని విడిచిపెట్టదని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ హాన్స్ క్లగీ హెచ్చరించారు.
కనీసం 70 శాతం వరకూ వ్యాక్సినేషన్ ను మనం సాధించగలిగితేనే మహమ్మారి అంతమవుతుందని అభిప్రాయపడ్డారు. యూరప్ లో వ్యాక్సినేషన్లు ఇంకా మందకొడిగానే సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన….టీకాల పంపిణీని వేగవంతం చేయాల్సి ఉందన్నారు.
- Advertisement -