- Advertisement -
చాలాకాలం తర్వాత హీరో తరుణ్ మళ్లీ కొత్త అవతారం ఎత్తనున్నాడు.తన తల్లి రోజా రమణి బాటలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అలరించేందుకు సిద్ధమయ్యారు. మలయాళ స్టార్ హీరో ఫహద్ పాసిల్ నటిస్తోన్న అతిథి చిత్రానికి డబ్బింగ్ చెప్పనున్నాడట తరుణ్. ఆహా ప్లాట్ ఫామ్‌లో ఈ మూవీ విడుదల కానుండగా ప్రస్తుతం ఈ వార్త టీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.
చైల్డ్ ఆర్టిస్టు నుంచి లీడ్ హీరోగా మారిన తరుణ్ ఒకప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ హీరోగా తన హవా నడిపించాడు. అయితే తర్వాత వరుస ఫ్లాప్‌లు,బిజినెస్ కూడా కలిసి రాకపోవడంతో వెండితెరకు దూరమయ్యారు. అయితే తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తరుణ్ చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి.
- Advertisement -