కేర‌ళ‌లో మరోసారి లాక్‌డౌన్ పొడగింపు..

209
Kerala Lockdown
- Advertisement -

క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేర‌ళ‌లో విధించిన లాక్‌డౌన్ ను ఈనెల 30 వ‌ర‌కూ పొడిగిస్తున్న‌ట్టు సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ శుక్ర‌వారం వెల్ల‌డించారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 30,000 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డంతో కరోనా కట్టడికి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రెండోసారి సీఎంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన శుక్రవారం విధుల్లో చేరిన వెంటనే కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఆరోగ్యశాఖా బాధ్యతలు చేపట్టిన మంత్రి వీణా జార్జ్ తో కూడా చర్చించారు.

మ‌రోవైపు తిరువ‌నంత‌పురం, ఎర్నాకుళం, త్రిసూర్ జిల్లాల్లో పాజిటివిటీ రేటు, యాక్టివ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో ఆయా ప్రాంతాల్లో నియంత్ర‌ణ‌ల‌ను స‌డ‌లించారు. మ‌ల‌ప్పురం జిల్లాలో లాక్‌డౌన్ నియంత్ర‌ణ‌లు కొన‌సాగుతాయ‌ని సీఎం విజ‌య‌న్ పేర్కొన్నారు. ఇక కేర‌ళ‌లో మ‌హమ్మారి బారిన‌ప‌డి తాజాగా 124 మంది మ‌ర‌ణించారు. రాష్ట్రంలో క‌రోనా పాజిటివిటీ రేటు 23.18 శాతంగా న‌మోదైంది. కరోనా కేసులు తీవ్రంగా వ్యాపిస్తున్నందున తప్పనిసరి పరిస్తితుల్లో ట్రిపుల్ లాక్ డౌన్ విధించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

కరోనా ట్రీట్మెంట్ పొందుతున్న 41,032 మంది కరోనా నుంచి కోలుకోవడం ఉపశమనం కలిగించినా 142 మంది ప్రాణాలను కోల్పోవడం బాధకరమని సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. తొలిదశ కరోనాను ఎదుర్కొన్న తరహాలోనే ఇప్పుడు కూడా కరోనాను కఠినంగా సమూలంగా పారదోలాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -