- Advertisement -
రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉండనుండగా తర్వాత పూర్తిస్ధాయి లాక్ డౌన్ విధించారు.
ఇక వినియోగదారుల విజ్ఞప్తి మేరకు కరెంట్ బిల్లులను చెల్లించేందుకు మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం పొడగించగా తాజాగా లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులను మినహాయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పెట్రోల్ బంకులన్నీ ఎప్పటిలా సాధారణంగా తెరుచుకుని ఉండనున్నాయి.
- Advertisement -