- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య,మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 4,529 మంది మృతిచెందారు. 3,89,851 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,96,330కి చేరాయి. ఇప్పటివరకు 2,83,248 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 32,26,719 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 32.03 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
- Advertisement -