- Advertisement -
ప్రపంచదేశాలను కరోనా వైరస్ గజగజ వణికిస్తూనే ఉంది. కరోనా కొత్త వేరియంట్ అనగానే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం కొత్త కొత్తగా మార్పులు చెందుతూ వస్తున్న కరోనా తాజాగా మరో లక్షణం బయటపడింది.
ఇప్పటివరకు కరోనా లక్షణాలు అనగానే జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కొల్పోవడం వంటి లక్షణాలు ఉండేవి. తాజాగా నాలుక ఎర్రబారడం, ఎండిపోవడం, దురదగా అనిపించడం, నాలుకపై గాయాలు కావడం వంటివి కూడా కరోనా లక్షణాలుగా గుర్తించారు. ఈ లక్షణాలు ఉంటే కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ లక్షణాలు ఉన్న వారిలో నీరసం కనిపిస్తుందని…. కొవిడ్ టంగ్ లక్షణాలకు గల కారణాలు ఎంటి? అనే దానిపై లోతైన అద్యయనం చేయాల్సి ఉందని నిపుణులు వెల్లడించారు.
- Advertisement -