ఏపీలో కరోనా బీభత్సం.. ఒక్కరోజులో 20,345 కరోనా కేసలు..

120
corona
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో 86,878 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,345 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 1,992, చిత్తూరు జిల్లాలో 2,426, తూర్పుగోదావరి జిల్లాలో 1,527, గుంటూరు జిల్లాలో 1,919, కడప జిల్లాలో 1,902, కృష్ణాజిల్లాలో 948, కర్నూలు జిల్లాలో 707, నెల్లూరు జిల్లాలో 1,673, ప్రకాశం జిల్లాలో 1,130, శ్రీకాకుళం జిల్లాలో 1,457, విశాఖపట్నం జిల్లాలో 2,371, విజయనగరం జిల్లాలో 744 , పశ్చిమగోదావరి జిల్లాలో 1,549 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 14,502 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, 108 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో నిన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో మరణించిన వారు కూడా ఉన్నారు. ఇక, ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,22,934కి పెరిగింది. ఇప్పటివరకు 11,18,933 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 1,95,102 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 8,899కి పెరిగింది.

- Advertisement -