క‌రోనా బాధితుల కోసం సోనూ సూద్ సంచనల నిర్ణయం..

38
Sonu Sood

బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్ కరోనా సమయంలో ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుంటూ నిజమైన ఆపద్భాందవుడు అనిపించుకున్నారు. తాజాగా దేశంలో కరోనా సెకండ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సోనూ సూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. సెకండ్ వేవ్‌లో ఇంత దారుణంగా ఉంటే.. థర్ట్ వేవ్ వస్తే చెప్పడానికి మాటల కూడా రావు.

ఈ సందర్భంగా సోనూ సూద్ కూడా కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను నెలకొల్పాలనే సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ దేశానికి సోనూ సూద్ ఓ ఆక్సిజన్ ప్లాంట్ కోసం ఆర్డర్ చేసారట. మరో రెండో వారాల్లో అక్కడ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రాబోతున్నట్టు సోనూ సూద్ తెలిపారు. ఈ విషయాన్ని సోనూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో వెల్లడించాడు. ఎప్పుడైన త‌న వంతు సాయం అందించేందుకు నేను , నా టీం సిద్ధంగా ఉన్నామ‌ని సోనూ అంటున్నారు.