ఈటల వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నాయకుల ఆగ్రహం..

120
- Advertisement -

మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మార్పీఎస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. విద్యానగర్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు.

తెలంగాణ ఎమ్మార్పీఎస్ టిఆర్ఎస్ పార్టీ అనుకూల సంస్థ అని ఈటెల రాజేందర్ ప్రవేట్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఎమ్మార్పీఎస్ నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. ఎమ్మార్పీఎస్ సంస్థ ఏ ఒక్క పార్టీ బిక్ష కాదని మాదిగల అణిచివేతకు చరమగీతం పాడాలని.. వర్గీకరణ సాధించాలని పుట్టిన సంస్థ అని గుర్తు చేశారు.1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిందన్నారు.

అప్పటికి టిఆర్ఎస్ పార్టీ ఏర్పడలేదని కెసిఆర్ ముఖ్యమంత్రి కాలేదని తెలిపారు. ఇప్పటికైనా ఈటల రాజేందర్ వాస్తవాలు తెలుసుకొని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ నాయకులు రమేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -