అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం..

55
Assam New CM

బీజేపీ సీనియర్‌ నేత, నార్త్‌ ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ కన్వీనర్‌ హిమంత బిశ్వ శర్మ అస్సాం నూతన ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ జగదీశ్‌ ముఖీ ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌, త్రిపుర సీఎం బిప్లబ్​ దేబ్​, మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్‌ సంగ్మా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్​, నాగాలాండ్ సీఎం నీఫ్యూ రియో తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారానికి ముందు డౌల్ గోవింద ఆలయం, కామాఖ్యా దేవి దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. 126 స్థానాలు అస్సాం అసెంబ్లీకి మూడు విడుతల్లో ఎన్నికలు జరగ్గా.. బీజేపీ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 60, ఏజీపీ, తొమ్మిది, యూపీపీఎల్‌ ఆరు స్థానాల్లో గెలుపొందాయి. ఆదివారం జరిగిన బీజేపీ సమావేశంలో శాసనసభా పక్ష నేత హిమంత బిశ్వ శర్మను ఎన్నుకున్నారు. దీంతో సర్బానంద సోనోవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు.