ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ..

150
rahul
- Advertisement -

కోవిడ్-19 విపత్తుపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. సెకండ్ వేవ్ సునామీలో దేశం విలవిల్లాడుతోందని….అధికారాన్ని ఉపయోగించి ఏం చేసైనా సరే ప్రజల ఇబ్బందులు తొలగించాలన్నారు.ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే..దేశ జనాభా, జనసాంద్రత నేపథ్యంలో వైరస్ శరవేగంగా అనేక మ్యుటేషన్లకు గురవుతోందన్నారు.

నియంత్రణ లేకుండా వైరస్‌ను వదిలేయడం వల్ల దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు అని లేఖలో పేర్కొన్న రాహుల్….వైరస్ మ్యుటేషన్లపై జీనోమ్సీక్వెన్సింగ్ ద్వారా అధ్యయనం చేయాలన్నారు.కొత్త మ్యుటేషన్లపై ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావాన్ని పరీక్షించాలని…దేశ జనాభా మొత్తానికి మెరుపువేగంతో వ్యాక్సినేషన్ చేయాలన్నారు.

మన అధ్యయనాల ఫలితాలను పారదర్శకంగా మిగతా ప్రపంచానికి తెలియజేయాలని……ప్రభుత్వానికి స్పష్టమైన వ్యాక్సినేషన్ ప్రణాళిక లేదు…అలాగేవిజయం సాధించకుండానే సంబరాలు జరుపుకున్నారన్నారు.ఫలితంగా దేశం అత్యంత ప్రమాదభరిత స్థితికి చేరుకుంది….ఈ విపత్తు అన్ని వ్యవస్థలు, యంత్రాంగాల సామర్థ్యాన్ని మించి సవాల్ విసురుతోందన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలు దేశాన్ని మరో సంక్షోభంలోకి నెట్టే నేషనల్ లాక్‌డౌన్ దిశగా తీసుకెళ్తున్నాని…..దేశ ప్రజలకు తగిన ఆహార, ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలన్నారు.లాక్‌డౌన్ వల్ల జరిగే ఆర్థిక ఇబ్బందుల గురించి మీరు ఆలోచిస్తున్నారు…ఆర్థికంగా లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే మహా విషాదకర సంక్షోభంలోకి దేశం వెళ్తుందన్నారు.సంక్షోభ సమయంలో అందరిని కలుపుకుని ముందుకెళ్లాలి….ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మా మద్ధతు ప్రభుత్వానికి ఉంటుందన్నారు.

- Advertisement -