- Advertisement -
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తోంది. గత 24 గంటల్లో 5,892 పాజిటివ్ కేసులు నమోదుకాగా 46 మంది మృతిచెందారు.కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా పలు ఎన్జీవోలు కరోనా బాధితులకు సాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి.
తాజాగా తెలంగాణ పోలీసు శాఖ ముందుకొచ్చింది. ఇంట్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించనుంది. సత్యసాయి సేవా సంస్థ, ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి, బిగ్ బాస్కెట్, హోప్ సంస్థలతో కలిసి ‘సేవా భోజనం’ పేరిట పథకాన్ని ప్రారంభించారు.
భోజనం అవసరమైన వారు ఉదయం ఏడు గంటల్లోగా 77996-16163 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. దీంతో వారికి ఉచితంగా భోజనాన్ని అందజేయనున్నారు పోలీసులు.
- Advertisement -