వ్యాక్సిన్ వేసుకుంటే బీర్ ఫ్రీ..!

76
covid

అమెరికా ఇప్పటికే వ్యాక్సినేషన్‌లో టాప్‌గా నిలవగా నో మాస్క్‌ పాలసీని సైతం తీసుకొచ్చింది. అయితే తాజాగా టీకాపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో అవగాహన పెంచేందుకు సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది.

టీకా వేసుకుంటే బీర్, పెట్రోల్, సేవింగ్ బాండ్లు, ఎయిర్ లైన్ టికెట్స్, సరుకులు కొనుక్కునేందుకు 500 డాలర్లు(రూ.36,982) ఇస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసేందుకు ఇలాంటి ఆఫర్లు ప్రకటించింది బైడెన్ సర్కార్.

ఏప్రిల్ రెండో వారంలో రోజుకు 32 లక్షల మంది టీకా వేసుకోగా, చివరి వారానికి 25 లక్షలకు తగ్గింది. దీంతో రాష్ట్రాలు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు జనం టీకా వేసుకునేలా ఆఫర్లు ఇస్తున్నాయి.