దేశంలో 24 గంటల్లో 4,14,188 కరోనా కేసులు

57
corona

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తుండగా వరుసగా నాలుగో రోజు 4 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,14,188 పాజిటివ్ కేసులు నమోదుకాగా 3915 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,14,91,598కు చేరగా1,76,12,351 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 36,45,164 యాక్టివ్ కేసులుండగా ఇప్ప‌టివ‌ర‌కు 16,49,73,058 మందికి టీకా పంపిణీ చేశామ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దేశ‌వ్యాప్తంగా మొత్తం 29,86,01,699 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది.