- Advertisement -
గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రగతి భవన్లో సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు వీకెండ్ లాక్డౌన్పై వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, డీఎంఈ రమేశ్ రెడ్డి హాజరయ్యారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ చేరుకున్న విషయం తెలిసిందే.
- Advertisement -