- Advertisement -
దేశ ప్రజలకు బ్యాడ్ న్యూస్ చెప్పింది కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. జూలై వరకు వ్యాక్సిన్ల కొరత ఉంటుందని….ఇందుకు కేంద్రానిదే బాధ్యతని వెల్లడించారు ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా.
గతంలో వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంచలేదు. తగిన ఆర్డర్లు లేవు కాబట్టి తయారీ పెంచలేదు. ఏడాదికి 100 కోట్ల డోసులు అవసరమవుతాయని మేము అనుకోలేదు అని పూనావాలా స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ కోసం తనకు బెదిరింపులు వస్తున్నాయని, అందుకే ఇండియా వదిలి లండన్ వచ్చేసినట్లు ఆయన చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఇండియా వస్తానని, వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తానని తెలిపారు. ప్రస్తుతం పుణెలోని సీరంలో నెలకు 6-7 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు తయారువుతున్నాయి.
- Advertisement -