- Advertisement -
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సాయం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. అయితే అదే సమయంలో భారత్ నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించగా తాజాగా భారత్‌లో ఉన్న తమ దేశస్తులకు కీలక సూచనలు చేసింది అమెరికా.
ఇండియాలో ఉన్న తమ దేశ పౌరులందరూ స్వదేశానికి తిరిగి వచ్చేయాలని అమెరికా ప్రభుత్వం కోరింది. వీలైనంత త్వరగా అమెరికాకు చేరుకోవాలని చెప్పింది. భారత్ ఎవరూ వెళ్లవద్దని, భారత్ నుంచి వచ్చేయడమే ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితమని సూచన చేసింది.
అమెరికాకు ప్రతిరోజు ఇండియా నుంచి 14 విమానాలు నేరుగా వస్తున్నాయని, యూరప్ మీదుగా అమెరికాకు ఇతర సర్వీసులు అందుబాటులో ఉన్నాయని వాటిద్వారా దేశానికి చేరుకోవాలని వెల్లడించింది.
- Advertisement -