తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా టిఆర్ఎస్ పార్టీ ని స్థాపించిన తెలంగాణ గాంధీ మన ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పోరాట స్పూర్తి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ త్రాగునీటి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా మరో మంత్రి సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్‌కుమార్, చిఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే నన్నపునేని నరెందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి,మహ-బాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అంగోతు బిందు, పార్టీ ప్రధాన కార్యదర్శి బాలమల్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి జన్ను జకర్యా, తదితర టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హన్మకొండ అథాలత్ సర్కిల్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, కాళోజీ, ప్రొఫెసర్ జయశంకర్ సారు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి, అమరులకు శ్రధ్ధాంజలి ఘటించి, టిఆర్ఎస్ పార్టీ జెండాను అవిష్కరించారు.
నాటి ఉద్యమంలో పనిచేసిన నాయకులకు, కార్యకర్తలను శాలువాలతో సన్మానించారు. నాడు దేశానికి మహాత్మాగాంధి నాయకత్వంలో స్వాతంత్ర్యం తీసుకొస్తే.. నేడు తెలంగాణ అభివృద్ది వ్యతిరేకుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన మహానీయుడు మన తెలంగాణ గాంధీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని అన్నారు.