ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. మొదట టాస్ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఫిట్‌గా లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు. లుంగి ఎంగిడి, అలీ స్థానంలో డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్ తుది జట్టులోకి వచ్చినట్లు ధోనీ తెలిపాడు.
మరోవైపు రిచర్డ్సన్ స్థానంలో క్రిష్టియన్, షాబాజ్ స్థానంలో నవదీప్సైనీలను ఎంపికచేసినట్లు కోహ్లీ పేర్కొన్నాడు. సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన బెంగళూరు రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మరోవైపు ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడినా.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో చెన్నై జోరుమీదుంది. ఈ రెండు జట్ల మధ్య ఫైట్ ఆసక్తికరంగా సాగనుంది.
తుది జట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడికల్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (wc), వాషింగ్టన్ సుందర్, డేనియల్ క్రిస్టియన్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, సురేష్ రైనా, అంబతి రాయుడు, ఎంఎస్ ధోని (w / c), రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్