‘అఖండ’ టీజర్‌ కొత్త రికార్డ్..

259
Akhanda
- Advertisement -

నంద‌మూరి బాలకృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో ‘అఖండ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలసిందే. ఇటీవ‌లే ఈ మూవీ టైటిల్ టీజ‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్ . ‘అఖండ’ టైటిల్‌తో పాటు అగోరా పాత్రతో కూడుకున్న సెకండ్ టీజర్ రిలీజై మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా ‘అఖండ’ టీజర్ 40 ప్లస్ మిలియన్స్ వ్యూస్ రాబట్టి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో అభిమానులు ..ప్రేక్షకులు.. సినీ వర్గాలు బాలయ్య ‘అఖండ’.. అఖండ విజయాన్ని నమోదు చేయబోతోందని నమ్మకంగా చెప్పుకుంటున్నారట.

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఇదివరకే సింహా, లెజెండ్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు మ‌రో సెన్సేష‌న్ క్రియేట్ చేసేందుకు స‌న్న‌ద్ధ‌మయ్యారు. మే 28న చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌, ఈ టైంకి రావ‌డం క‌ష్ట‌మేన‌ని అనిపిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ పోషిస్తుండగా.. ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -