కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో జిల్లా వైద్య అధికార బృందంతో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి హరీష్ రావు. జిల్లాలో పరిస్థితులపై ఆరా తీసి.. అక్కడికక్కడే కలెక్టర్ వెంకట్రామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, డీఎంహెచ్వోలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అదే విధంగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ డైరెక్టర్, సూపరిండెంట్, ఆర్ఎంవోలు, కోవిడ్ వార్డు ఇంచార్జులతో సమీక్షించారు మంత్రి హరీష్.
అనంతరం మంత్రి మాట్లాడుతూ..వ్యాక్సిన్ వినియోగంలో రాష్ట్రంలోనే మన జిల్లా ఫస్ట్. ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో 96 శాతం, 45 ఏళ్ల పైబడ్డ వారిలో 88 శాతం టీకా వినియోగం జరిగింది.. రెండ్రోజుల్లో మిగితా అందరికీ మొదటి డోస్ టీకా పూర్తి చేయాలి అని మంత్రి ఆదేశించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.
సిద్దిపేటలో 120 బెడ్లతో కరోనా వార్డు సిద్దంగా ఉంది. సురభి కాలేజీలో మరో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయిస్తామన్నారు. ఆక్సిజన్, రెమిసిడివర్ ఇంజక్షన్, పీపీఈ కిట్ల కొరత లేదు. కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలు సమానంగా పనిచేస్తాయి భయపడవద్దు.మరో 30వేల వ్యాక్సిన్లు పంపించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు సూచన చేశాం. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డీఎంహెచ్‌వో, మెడికల్ కాలేజీ డైరెక్టర్లకు మంత్రి ఆదేశించారు..