ఆక్సిజన్ కొరతపై కేంద్రం చర్యలు…

259
oxygen
- Advertisement -

దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరతపై కేంద్రం చర్యలు చేపట్టింది .సింగపూర్ నుంచి అధిక సామర్థ్యం కలిగిన ట్యాంకర్ల దిగుమతి చేసుకోనుంది.చాంగి ఎయిర్ పోర్టు నుంచి భారత వాయుసేన విమానాల్లో లిక్విడ్ ఆక్సిజన్ కంటైనర్లు తరలింపు జరుగగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది కేంద్ర హోంశాఖ.

మరోవైపు ఆక్సిజ‌న్ కొర‌త తీవ్ర‌మవుతున్న వేళ ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను అడ్డుకునే వ్య‌క్తిని ఉరితీస్తామంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను అడ్డుకుంటున్న ఒక్క ఘ‌ట‌న గురించి మాకు చెప్పండి.. ఎవ‌రినీ వదిలిపెట్ట‌మ‌ని స్ప‌ష్టం చేసింది. అలాంటి అధికారుల గురించి కేంద్ర ప్ర‌భుత్వానికి కూడా చెప్పాల‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకుంటార‌ని చెప్పింది.

- Advertisement -