కరోనా కష్టకాలంలో పేదలకు కేంద్రం తీపి కబురు..

165
PMGKAY
- Advertisement -

కరోనా మ‌హ‌మ్మారి దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని పేద ప్ర‌జ‌ల‌కు ఊరట శుభవార్త అందించింది. గతంలో లాక్‌డౌన్ సమయంలో పేదలు ఇబ్బందిపడకుండా ఉండేందుకు వారికి ఉచితంగా రేషన్ ద్వారా ఆహారధాన్యాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు కూడా అదే రకమైన నిర్ణయం తీసుకుంది. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న ప‌థ‌కం కింద మే, జూన్ నెల‌ల్లో ఉచితంగా ఆహార ధాన్యాల‌ను స‌మ‌కూర్చ‌నున్న‌ట్లు కేంద్ర స‌ర్కారు తెలిపింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ప్రకటించారు.

ఒక్కో ల‌బ్ధిదారుకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల‌ను అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ ప‌థ‌కం ద్వారా మొత్తం 80 కోట్ల మందికి ల‌బ్ధి చేకూర‌నుంద‌ని, దీని కోసం తాము రూ.26 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. గతేడాది నవంబర్ వరకు కేంద్రం ఇదే రకంగా పేదలకు ఈ పథకం ద్వారా ఆహారధాన్యాలు అందించింది.

- Advertisement -