- Advertisement -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. కోవిడ్-19 పరిస్థితిపై ఉదయం 9 గంటలకు అధికారులతో ప్రధాని సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఉదయం 10 గంటలకు కొవిడ్‌తో తీవ్ర ప్రభావితమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ….మధ్యాహ్నం 12.30 గంటలకు ఆక్సీజన్ తయారీదార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఒకేరోజులో ఏకంగా 3.14 లక్షల కేసులతో ఏకంగా ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది.. అటు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. దేశంలో ఆక్సిజన్, ముఖ్యమైన మందులు, వ్యాక్సిన్ విధానంపై ఓ జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఇవాళ ప్రధాని మోడీ మూడు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
- Advertisement -