మున్సిపోల్స్‌ వేళ…బీజేపీ బండికి షాక్‌!

60
bandi

రాష్ట్రంలో రెండు కార్పొరేషన్‌లు,ఐదు మున్సిపాలిటీలు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ప్రధానపార్టీలు మునిగితేలగా బీజేపీ మాత్రం ఎదురిదుతూనే ఉంది. కొన్నిచోట్ల బీజేపీకి అభ్యర్థులు కరువవగా తాజాగా జడ్చర్లలో బీజేపీకి షాక్ ఇచ్చాడు ఆ పార్టీ రాష్ట్ర స్టడీ సర్కిల్ ఇంఛార్జ్ రామ్మోహన్‌.

తాను బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీలో స్థానికేత‌రుల పెత్త‌నంపై అసంతృప్తితోనే పార్టీని వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఓవైపు తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు అస‌లైన ప్ర‌త్యామ్నాయం తామేనంటూ బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండగా మరోవైపు అంత‌ర్గ‌త విభేదాల‌తో కొంత మంది నేత‌లు పార్టీని వీడ‌డం చ‌ర్చ‌ నీయాంశంగా మారింది.