- Advertisement -
వేసవి కాలం అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండడంతో సికింద్రాబాద్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని itc కాకతీయ లో మాక్ డ్రిల్ నిర్వహించారు. హోటల్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయాలను అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ వివరించారు.
కిచెన్ లో అగ్ని కీలలు ఎగిసి పడినప్పుడు ఫైర్ ఎక్యుప్ మెంట్ ద్వారా మంటలను ఎలా అదుపు చేయాలి అనే విషయాలను వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు అపస్మారక స్థితికి వెళ్ళిన వారిని వారిని ఎలా రక్షించాలి అనే విషయాలను వివరించారు.
- Advertisement -