- Advertisement -
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి ఏప్రిల్ 30 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుందని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.రాత్రి 8 గంటల వరకే కార్యాలయాలు,దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది.
- Advertisement -