రాజస్థాన్‌పై చెన్నై ఘన విజయం..

149
ali
- Advertisement -

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా రెండో విజయాన్ని నమోదుచేసింది ధోనీ సేన. ఇటు బ్యాటింగ్…అటు బౌలింగ్‌లోనూ రాణించిన చెన్నై…..రాజస్థాన్‌ను మట్టికరిపించింది.ఈ విజయంతో కెప్టెన్‌గా 200వ విజయాన్ని నమోదుచేశారు మహీ.

చెన్నై విధించిన 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై…నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి కేవలం 143 పరుగులు మాత్రమే చేసింది. బట్లర్‌ (49) ఒక్కడే రాణించగా మిగితా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. దీంతో రాజస్థాన్ ఓటమి ఖాయమై పోయింది.

అంతకముందు బ్యాటింగ్‌ చేసిన చెన్నై ధాటిగా ఇన్నింగ్స్‌ని ఆరంభించింది. గైక్వాడ్ మరోసారి విఫలమైన డుప్లెసిస్‌ (33), రాయుడు (27),అలీ(26),చివర్లో బ్రావో(20) రాణించడంతో 188 పరుగుల భారీ స్కోరు సాధించింది. అలీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

- Advertisement -