నాని… అంటే సుంద‌రానికీ అప్ డేట్

226
nani
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న 28వ చిత్రం అంటే సుందరానికీ.. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా న‌జ్రియా న‌జీమ్ తెలుగులో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతుంది. రాజా రాణి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన న‌జ్రియా ఈ రోజు నుండి అంటే సుంద‌రానికీ మూవీ షూటింగ్ లో పాల్గొటోంది. హైద‌రాబాద్‌ లో జ‌రుగుతోన్న ఈ షెడ్యూల్‌లో న‌జ్రియా స‌హా ఇతర కీల‌క తారాగ‌ణంపై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ‌

ఈ సంద‌ర్భంగా హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్ `నా ఫ‌స్ట్ తెలుగు మూవీకోసం చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాను. ఫ‌స్ట్‌ చేసే పని ఏదైనా స్పెషల్‌గా ఉంటుంది. కాబట్టి ‘అంటే సుందరానికీ’ నాకు చాలా స్పెషల్‌” అని పోస్ట్ చేసింది.ఒరిజిన‌ల్ స్టోరీతో ఒక మ్యూజిక‌ల్ రోమ్-‌కామ్ గా తెర‌కెక్కుతోన్న అంటే సుంద‌రానికీ చిత్రంలోకి న‌జ్రియా న‌జీమ్‌ను ఆహ్వానించింది చిత్ర యూనిట్‌‌. ఈ సంద‌ర్భంగా మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు మాట్లాడుతూ – “మా టీమ్ త‌రుపున అంటే సుంద‌రానికీ చిత్రంలోకి న‌జ్రియా న‌జీమ్‌ను స్వాగ‌తిస్తున్నాం.త‌న‌కి, మ‌రియు మా టీమ్ అంద‌రికీ ఈ చిత్రం త‌ప్ప‌కుండా ప్ర‌త్యేకంగా ఉంటుంది“ అని అన్నారు. బ్రోచేవారెవ‌రురా త‌ర్వాత వివేక్ ఆత్రేయతో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, రవితేజ గిరిజ‌ల ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌.

తారాగ‌ణంః
నాని, న‌జ్రియా న‌జీమ్‌

సాంకేతిక వ‌ర్గంః
ర‌చ‌న‌, ద‌ర్శ‌కత్వం: వివేక్ ఆత్రేయ‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ వై
బ్యాన‌ర్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అనిల్ ఎర్నేని
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫి: నికేత్ బొమ్మి
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజ‌ల‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ల‌త త‌రుణ్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ప‌ల్ల‌వి సింగ్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనిల్ భాను,
పిఆర్ఓ: వంశీ- శేఖ‌ర్‌
మార్కెటింగ్‌: ఫ‌స్ట్ షో
ప‌బ్లిసిటి: బాబా సాయి కుమార్‌.

- Advertisement -