తెలంగాణకు వర్ష సూచన..

96
ts
- Advertisement -

రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది హైదరాబాద్ వాతావరణశాఖ. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రములోని ఒకటి, రెండు ప్రదేశములలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వెల్లడించింది.

నైరుతి మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల నుండి మరత్వాడా మీదగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిమి ఎత్తు వద్ద ఉపరితల ద్రోణిఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది.

రాగల మూడు రోజులు (19, 20, 21వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రదేశములలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించింది. రాగల మూడు రోజులు (19,20,21వ తేదీలలో) గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది.

- Advertisement -