తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ గా ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు హరీష్ రావు,కొప్పుల ఈశ్వర్ ,వేముల ప్రశాంత్ రెడ్డి,మహిళ కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి,ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, భూపాల్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్….సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఉద్యమం లో కీలక పాత్ర పోషించి న్యాయవాది గా పని ఇవాళ అసంఘటిత కార్మికుల బోర్డ్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉంది. పదవులు అందరికి వస్తాయి,కొంత లెట్ అయిన ఇవాళ దేవేందర్ రెడ్డి గారికి ఇవాళ పదవి వచ్చిందన్నారు.
అసంఘటిత కార్మికుల బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డికి వాళ్ళ సబ్యులకు శుభాభినందనలు తెలిపారు మహిళ కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి .తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు..ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఇవాళ దేవేందర్ రెడ్డి,పార్టీ లో ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తారన్నారు.
దేవేందర్ రెడ్డి ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నది అయినప్పటికీ ఎలాంటి పదవులు ఆశించలేదు.అయినప్పటికీ సీఎం కేసీఆర్ మంచి సముచిత స్థానం కల్పించారని తెలిపారు ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి.