ఖైదీతో నాగ్..!

191
- Advertisement -

నాగార్జున ఊపిరి,సోగ్గాడే చిన్నినాయన,ఓం నమో వేంకటేశయా సినిమాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్నాడు. సినిమాల పరంగా కొత్త ప్రయోగాలకి నాగార్జున ఎప్పుడూ సిద్ధంగానే వుంటారు. ఆ విషయాన్నిఆయన అనేక మార్లు తాను చేసిన సినిమాతో నిరూపించారు కూడా. గతంలో మంచు విష్ణుతోను .. కార్తీ.. తోను ఆయన మల్టీ స్టారర్ మూవీస్ చేశారు. అవకాశం వస్తే చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ లతో మల్టీస్టారర్ చేస్తారా? అనే ప్రశ్న తాజాగా నాగార్జునకి ఎదురైంది.

 Nagarjuna Multistarrer Movie

కొత్తగా పాత్ర చేయాలంటే నాగార్జున ఎప్పుడు సిద్ధమే అన్నారు.మల్టీస్టారర్ చిత్రాలు రావడం చిత్ర పరిశ్రమ మంచి విషయం ఒకప్పుడు ఎఎన్ఆర్,ఎన్టిఆర్,కృష్ణ,శోభన్ బాబు లాంటివారందరూ మల్టీస్టారర్‌గా చేసినవాల్లే ఆ సినిమా కూడా మంచి విజయాలు సాదించాయి.నేను కూడా చేయడానికి ఎప్పుడు రెడీగానే వుంటాను అన్నారు.

ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి, సీనియర్ హీరోలతో మల్టీస్టారర్ చేయడానికి కూడా తాను సిద్ధంగానే వున్నానని ఆయన చెప్పారు. అయితే ఈ తరహా సినిమాలు తెరకెక్కాలంటే కథానాయకులిద్దరికీ పాత్ర పరంగా సమానమైన ప్రాధాన్యత ఉండవలసిన అవసరం ఉందని అన్నారు. అలా కుదరకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని చెప్పారు. సమ ప్రాధాన్యతతో కూడిన కథలతో వస్తే, ఎవరితో చేయడానికైనా తాను రెడీగానే వున్నానని స్పష్టం చేశారు. సినియర్ జూనియర్ ఎవరితోనైనా ఓకే అని చెప్పారు.

- Advertisement -