నాని సక్సెస్‌ సీక్రెట్ తెలిసిపోయిందోచ్‌..!

271
Nani Success Secret
- Advertisement -

 ఎలాంటి భారీ పబ్లిసిటీ లేకుండా ఒక సినిమా హిట్ అయిందంటే దానికి కారణం ఆ సినిమా కథే.! అవును,నెలల తరబడి కష్టపడుతూ ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు ఆ చిత్ర యూనిట్‌. సినిమా హిట్ అవడానికి  కారణం కేవలం చిత్ర దర్శకుడు, హీరోనే అనుకుంటే పొరపాటే. ఎంత పెద్ద హీరో అయినా ఒక మంచి కథ ముందు హీరో ఎప్పుడూ చిన్నవాడే. అంటే కథ, కథనం బాగుంటే సక్సెస్‌ ని సాధించడం  గ్యారంటీ అన్నమాట.

అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు వహిస్తుంటారు చాలా మంది హీరోలు. నిజానికి కథలో దమ్ముంటే సక్సెస్‌ ఎప్పుడూ వెంటే ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మరోటి ఉంది. అసలు ఎలాంటి  కథలు ఎంచుకోవాలో కూడా హీరోలకు కాస్త అవగాహణ కూడా ఉంటే మరో ప్లస్‌ పాయింట్ గా కూడా మారుతుంది.
Nani Success Secret
మరి ఈ విషయాన్ని నాని ఎప్పుడు తెలుసుకున్నాడోగానీ ఇప్పుడు ఇదే పద్దతిని పాటిస్తున్నాడు ఈ నాచురల్‌ స్టార్.! కథలను ఎంచుకునే విషయంలో తమదైన నైపుణ్యాన్ని కనబరుస్తూ తెలుగు ప్రేక్షకులకు నాని మరింత దగ్గరవుతున్నాడు. ఇదే బాటలో కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న మరో యంగ్‌ హీరో  శర్వానంద్.  ఈ ఇద్దరూ వరుస సక్సెస్‌ లతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

ఈ యువ కథానాయకులిద్దరికీ కథల పట్ల అవగాహన ఉండటం నిజంగా విశేషం. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి ‘నేను లోకల్’ వరకూ నాని వరుసగా 6 హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ప్రేక్షకులను అబ్బురపరిచాడు. ఇదంతా చూస్తుంటే..సక్సస్‌ కోసం తొందరపడకుండా కొత్త కథలను .. విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడమే ఈ యువ హీరోల సక్సెస్ సీక్రెట్ అని తెలిసిపోతుంది.

- Advertisement -