మహేష్‌ భార్య మనసు మార్చుకుంది..!

243
Mahesh Babu Wife Namrata Re Entry in Movies
- Advertisement -

సినిమా ఇండస్ర్టీలో హీరోయిన్స్‌ గా సత్తా చాటుకున్నవాళ్ళంతా పెళ్ళవగానే సినిమాలకు దూరమవుతున్నారు. అంతకముందు అందాలన్నీ ఆరబోసిన ఆ భామలు పెళ్ళయ్యాక మాత్రం ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నారు. కానీ సినిమాపై ఉన్న ఆసక్తితో కొంతమంది రీ ఎంట్రీ లు కూడా ఇస్తున్నారు. ఇలాగే మళ్ళీ సినిమాలో మెరవాలనే తపనతో ఒకప్పటి మిస్‌ ఇండియా ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఆ మిస్‌ఇండియా ఎవరనేదేగా మీ సందేహం.?

ఆ మిస్‌ఇండియా 2005లో ‘బ్రైడ్ అండ్ ప్రిజుడిస్’ అనే ఆంగ్ల చిత్రంలో నటించింది. ఆ టైంలో  తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ  ఆ తర్వాత వేరే సినిమాల్లో కనిపించలేదు. ఆ అందాల భామ పేరే నమ్రత శిరోద్కర్. హీరో ప్రిన్స్‌ మహేష్ బాబుని పెళ్ళిచేసుకున్నఈ మిస్‌ ఇండియా ఆ తర్వాత మహేష్ బాబుకు సంబందించిన వ్యవహారాలూ, కుటుంబ పరమైన విషయాలు, ఇతర వ్యాపార విషయాలను చూసుకుంటూ బిజీబిజీగా గడిపేసింది.

ఇలా తన జీవనవిధానాన్ని కొనసాగిస్తూ వచ్చిన నమ్రత తన మనసు మార్చుకుంది. ఆమె మనసు మళ్ళీ సినిమాల వైపు మళ్ళీంది. అందుకే ఆమె ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నమ్రత ప్రస్తుతం ఒక మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు.
 Mahesh Babu Wife Namrata Re Entry in Movies
ఇంకేముంది. ఇది విన్న ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఇన్నాళ్ళూ సినిమాలకు దూరంగా ఉన్న నమ్రత ఒక్క సారిగా మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తుందని చెప్పడంతో  ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. కానీ నమ్రత  మాత్రం తాను  ఏ సినిమాలో నటిస్తోంది, అందులో ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది లాంటి వివరాలేమీ తెలుపలేదు. దీంతో అందరిలోనూ ఆమె చేస్తున్న ప్రాజెక్ట్ ఏమిటనే ఆసక్తి నెలకొంది.

- Advertisement -