ఈ రోజు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పలువురు మంత్రులు ఆయనకు ఘన నివాళులర్పించారు.. స్వాతంత్ర్య సమరయోధులు, దళితుల వికాసం కోసం కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా, ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరం పునరంకితం అవుదామని మంత్రి కేటీఆర్ అన్నారు.
స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
సమాజంలో అణగారిన వర్గాలకోసం అలుపెరుగని కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాం అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.